![]() |
![]() |

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గుప్పెడంత మనసు'. ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -988 లో.. కాలేజీలోని స్టూడెంట్స్ ని శైలేంద్ర రెచ్చగొట్టి రిషి సర్ కావాలని గొడవ చేసేలా చేస్తాడు. అది తెలిసి వసుధార, మహేంద్ర, అనుపమ ఫణీంద్ర లు మినిస్టర్ గారు కాలేజీకి వచ్చి స్టూడెంట్స్ కి నచ్చజెప్పుతారు. నువ్వు ఎండీగా ఉన్నప్పుడే ఇలా జరుగుతుందని వసుధారతో మినిస్టర్ అంటాడు.
చాలా సంవత్సరాల నుండి యూత్ ఫెస్ట్ కి గెస్ట్ గా వస్తున్నాను కానీ ఎప్పుడు ఇలా జరగలేదు. ఇప్పుడు నువ్వు ఫెయిల్ చేసావ్.. రిషిని తీసుకొని వస్తావని అనుకున్నారు కానీ అలా చెయ్యలేదని మినిస్టర్ అంటాడు. మీరు క్లాస్ కి వెళ్ళండి ఏదైన ఓక నిర్ణయం తీసుకొని మీకు చెప్దామని స్టూడెంట్స్ ని లోపలికి పంపిస్తాడు మినిస్టర్. ఆ తర్వాత బోర్డు మీటింగ్ జరుగుతుంది. బోర్డు మెంబెర్స్ అందరు వసుధార ఎండీ గా ఫెయిల్ అయిందని తనకి నెగటివ్ గా మాట్లాడతారు. వాళ్ళందరు శైలేంద్ర చెప్పినట్లుగా మాట్లాడుతుంటారు. ఎండీ గారు కాలేజీకీ సరిగ్గా రారు.. ఇన్ని ప్రాబ్లమ్స్ వచ్చాయంటే దానికి కారణం ఎండీ గారే అంటూ బోర్డు మెంబర్స్ అంతా మాట్లాడుతారు. అసలు రిషి ఎక్కడికి వెళ్లాడని మినిస్టర్ అడుగుతాడు. రిషి మీరు చెప్పిన సీక్రెట్ వర్క్ లో ఉన్న మాట నిజమే కానీ తనకి శత్రువులు ఎక్కువ కదా.. వాళ్ళ నుండి కాపాడుకుంటున్నాడు. ఇప్పుడు మాక్కూడా టచ్ లో లేడని మహేంద్ర చెప్తాడు. ఇప్పటికైనా ఎండీ బాధ్యతలు వేరేవాళ్లకి అప్పజెప్పాలి. ఇలానే ఉంటే కాలేజీ కీ ప్రాబ్లమ్ అవుతుందని బోర్డు మెంబర్స్ అందరు అంటారు.
ఆ తర్వాత మినిస్టర్ గారు మధ్యలో కలుగుజేసుకొని.. ఇప్పుడున్న సిచువేషన్ లో వసుధార అయితేనే సామర్ధ్యంగా నిర్వహించగలదని అనుకుంటున్నాను.. ఏం అంటావ్ శైలేంద్ర అని అనగానే.. తనకి ఇష్టం లేకున్నా.. అవును సర్ అని అంటాడు.. ఆ తర్వాత శైలేంద్ర రాజీవ్ ని కలిసి మాట్లాడతాడు. ఏంటి రెండుసార్లు వసుధార దగ్గరికి వెళ్ళావంట.. అలా వెళ్ళకని రాజీవ్ తో శైలేంద్ర చెప్తాడు. ఆ తర్వాత రాజీవ్ వెళ్లిపోతు.. ఇంతకి రిషి ఏమైపోయాడు. వాడి గురించి తెలియట్లేదని అనుకుంటాడు. రాజీవ్ వెళ్ళిపోయాక.. అసలు విషయం ఆ రిషి గాడిని ఎవరు కిడ్నాప్ చేశారోనని వీడిని కూడా అడగలేదు.. వీడే కిడ్నాప్ చేస్తే చెప్పేవాడు కదా అని శైలేంద్ర అనుకుంటాడు. ఆ తర్వాత వసుధార, మహేంద్ర, అనుపమ కలిసి కాలేజీలో జరిగిన దాని గురించి మాట్లాడుకుంటారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |